రీల్ లైఫ్‌లో త‌మ్ముడు.. రియ‌ల్ లైఫ్‌లో మ‌రిది

Tue,April 16, 2019 12:53 PM
Jyothika and Karthi to play siblings

న‌టుడు శివ‌కుమార్ వార‌సత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండ‌స్ట్రీలో స్టార్ స్టేట‌స్ పొందిన న‌టులు సూర్య‌, కార్తీ. వీరిద్ద‌రికి తెలుగు, త‌మిళ భాష‌ల‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య భార్య‌ జ్యోతిక కూడా న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. సూర్య సోద‌రి బృందా సింగ‌ర్‌గా ఇటీవ‌ల‌ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. మొత్తానికి శివ‌కుమార్ ఫ్యామిలీలో ఉన్న ఆర్టిస్టులంద‌రికి మంచి గుర్తింపు రావ‌డం విశేషం. అయితే అన్నదమ్ములు సూర్య, కార్తీ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్ప‌టినుండో క‌ల‌లు కంటున్నారు. దీనికి ఇంకాస్త టైం ప‌ట్టేలా ఉంది. కాక‌పోతే సూర్య భార్య‌ జ్యోతిక‌తో కార్తీ సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త అభిమానులకి కొద్దిపాటి ఆనందం క‌లిగిస్తుంది. సూర్య‌తో వివాహం త‌ర్వాత సెల‌క్టెడ్ ప్రాజెక్టులు చేస్తున్న జ్యోతిక ‘పాపనాశం’ చిత్ర దర్శకుడు జిత్తు జోసఫ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నుంది. ఈ చిత్రంలో కార్తీ.. జ్యోతిక సోద‌రుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. మొత్తానికి రియ‌ల్ లైఫ్‌లో మ‌రిదిగా ఉన్న కార్తీ రీల్ లైఫ్‌లో సోద‌రుడి పాత్ర‌లో క‌నువిందు చేయ‌నున్నాడ‌ట‌.

5339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles