బిగ్ బాస్3లో గుత్తా జ్వాల‌.. క్లారిటీ ఇచ్చిన బ్యాడ్మింట‌న్ స్టార్

Sun,May 26, 2019 08:07 AM
jwala Gutta Clears Air About Contesting In Bigg Boss Game Show

పాపుల‌ర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 జూలైలో ప్రారంభం కానుండ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే కంటెస్టంట్స్ ఎంపిక శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. యాంక‌ర్ శ్రీముఖి, వైవా హ‌ర్ష‌, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల బిగ్ బాస్ షోలో భాగం కానున్నార‌ని కొద్ది రోజుల నుండి ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తుంది. అయితే గుత్తా జ్వాల త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్స్‌కి ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. నేను బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంపిక అయ్యాన‌న్న‌ది అవాస్త‌వం. చ‌క్క‌ర్లు కొడుతున్న రూమర్స్ న‌మ్మోద్దు అంటూ గుత్తా జ్వాల పేర్కొంది. మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో ఆక‌ట్టుకున్న నాగార్జుననే బిగ్ బాస్ 3ని హోస్ట్ చేయ‌నున్నాడ‌ని చెబుతున్నారు. ఆయ‌న‌నే నిర్వాహ‌కులు ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ట‌.3235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles