కెన‌డా ప్ర‌ధానిని క‌లిసిన షారూఖ్ ఖాన్

Wed,February 21, 2018 10:47 AM
కెన‌డా ప్ర‌ధానిని క‌లిసిన షారూఖ్ ఖాన్

వారం రోజుల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కెన‌డా ప్ర‌ధాని జస్టిన్‌ ట్రూడో త‌న ఫ్యామిలీతో క‌లిసి ఇండియాకి వ‌చ్చారు. మంగ‌ళ‌వారం ముంబై చేరుకున్నజ‌స్టిన్‌ని బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ క‌లిసారు. సంప్ర‌దాయ దుస్తులో ఉన్న జ‌స్టిన్ ట్రూడో ఫ్యామిలీతో క‌లిసి ఫోటోలు కూడా దిగాడు. ట్రూడో పిల్ల‌లు ఎల్లా గ్రేస్‌, క్సావియ‌ర్ జేమ్స్‌, హ‌డ్రిన్‌ల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించాడు షారూఖ్‌. ఇక ఫ‌ర్హాన్ అక్త‌ర్, అనుప‌మ్ ఖేర్‌, మాధ‌వ‌న్ త‌దిత‌ర సెల‌బ్రిటీలు కూడా కెన‌డా ప్ర‌ధానిని క‌లిసి ఆయ‌న‌తో స‌ర‌దా టైం స్పెంట్ చేశారు. ఆయ‌న‌ని క‌ల‌వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని , ఈ టూర్ స‌క్సెస్ కావాల‌ని వారు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. భారత, కెనడా చిత్ర పరిశ్రమలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్న ట్రూడో కొత్త నైపుణ్యాల‌ని ప్రోత్స‌హించేందుకు ఇండో-కెనడా భాగస్వామ్యాలతో సినిమాల నిర్మాణం ఊపందుకుంది అని అన్నారు. తాజ్‌మ‌హ‌ల్‌ని సంద‌ర్శించిన ట్రూడో ఈ అనుభూతి చాలా కొత్త‌గా ఉందంటూ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.749

More News

VIRAL NEWS