జూలీ2 సీన్స్ లీక్ .. షాక్ అయిన రత్తాలు

Thu,November 23, 2017 04:23 PM
జూలీ2 సీన్స్ లీక్ .. షాక్ అయిన రత్తాలు

ఈ రోజులలో సినిమా విడుదలకి ముందే నెట్ లో సదరు చిత్రానికి సంబంధించిన సీన్స్ లీక్ కావడం కామన్ గా మారింది. తాజాగా సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ నటి రాయ్ లక్ష్మీ నటించిన జూలీ 2 చిత్రానికి సంబంధించిన మూడు సీన్స్ లీక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం రేపు విడుదల కానుండగా, దీనిపై రత్తాలు చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంది. అయితే రిలీజ్ కి ముందుగానే సీన్స్ లీక్ కావడం నన్ను షాక్ కి గురి చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది. మా టీం సీన్స్ లీక్ చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అని రాయ్ లక్ష్మీ అంది. జూలీ 2 చిత్రం రాయ్ లక్ష్మీకి హిందీలో డెబ్యూ మూవీకాగా, ఇది తన కెరీర్ లో 50వ చిత్రం. అయితే సినిమా రిలీజ్ కి ముందు వీడియోలు ఎలా బయటకు వచ్చాయి అనే దానిపై టీం సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది.


2484

More News

VIRAL NEWS