రాయ్ ల‌క్ష్మీ అభిమానుల‌కి గుడ్ న్యూస్‌

Tue,November 21, 2017 12:21 PM
julie 2 release date fixed

త‌న గ్లామ‌ర్ షోతో యూత్ కి బాగా క‌నెక్ట్ అయిన అందాల భామ రాయ్ ల‌క్ష్మీ. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా రాయ్ లక్ష్మి మంచి మార్కులు కొట్టేసింది. ఇక బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల కంట్లోను ప‌డ్డ ఈ అమ్మ‌డు రీసెంట్‌గా జూలి 2 అనే సినిమా చేసింది. నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ జూలికి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ప‌లు వివాదాల వ‌ల‌న రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వ‌చ్చింది. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది మూవీ యూనిట్‌. త‌మిళం, హిందీ భాష‌ల‌లో న‌వంబ‌ర్ 24న జూలీ 2 చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుండ‌గా .. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు . బాలీవుడ్ లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన సాంగ్స్‌, టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెంచాయి. సీబీఎఫ్‌సీ మాజీ ఛైర్మన్ ప‌హ్ల‌జ్ నిహలానీ ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.


1903
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS