హృతిక్‌ రోషన్‌ 'సూపర్‌ 30'.. ఫస్ట్‌ సాంగ్‌ జుగ్రాఫియా వచ్చేసింది

Sat,June 15, 2019 05:48 PM
Jugraafiya song from Super 30 released

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్ ప్రముఖ గణిత ప్రొఫెస‌ర్‌ ఆనంద్‌ కుమార్ జీవిత నేప‌థ్యంలో సూప‌ర్ 30 అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జూలై 12న సూప‌ర్ 30 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్టు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. వెండితెర‌పై హృతిక్‌ తొలిసారిగా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన సినిమా ట్రైల‌ర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది.

తాజాగా సినిమాలోని జుగ్రాఫియా అనే వీడియో సాంగ్‌ను మూవీ యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఉదిత్‌ నారాయణ, శ్రెయా ఘోషల్‌ ఈ పాటను పాడారు. అమితాబ్‌ భట్టాచార్య ఈ పాటను రాశారు. సాంగ్‌ వీడియోలో హృతిక్‌, మృణాల్‌ మ్యాథ్స్‌ క్లాస్‌, డ్యాన్స్‌ క్లాస్‌ వెళ్తూ ప్రేమించుకునే సీన్లను చూపించారు.




1586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles