కన్నుకొట్టిన ప్రియా.. నవ్వుకున్న న్యాయ‌మూర్తులు

Fri,February 23, 2018 01:52 PM
కన్నుకొట్టిన ప్రియా.. నవ్వుకున్న న్యాయ‌మూర్తులు

సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా వారియర్ నటించిన ఒరు ఆదార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ అనే సాంగ్ తమ మనోభావాలని దెబ్బతీసాయని ముస్లిం సంఘాలు నటి ప్రియాంక, దర్శకుడు ఒమర్ లులుపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకి స్వీకరించిన సుప్రింకోర్టు తాజాగా స్టే ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. కేసు విచారణ సమయంలో న్యాయ‌మూర్తుల బృందం పగలబడి నవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మలయాళ సాంగ్‌పై ముస్లిం సంఘాలు పెట్టిన కేసుకి సంబంధించి ఫిబ్రవరి 20న ప్రియా లాయర్ హరీష్ బీరన్ కేసు వివరాలు వినిపిస్తుండగా, బెంచ్‌కి సంబంధించిన ముగ్గురు న్యాయ‌మూర్తులు దీపక్ మిశ్రా, ఏఎన్ కాన్‌విల్కర్, చంద్రచుడ్ చిన్న స్మైల్ ఇచ్చారు. తర్వాతి రోజు కూడా ఇదే కేసుపై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లాయర్‌ని ప్రశ్నించాడు. ఆ సాంగ్ లిరిక్స్ ఏమన్నా ప్రియా రాసిందా, ఈ కేసు విషయంలో పిటీషనర్ హైకోర్టు ని ఎందుకు ఆశ్రయించలేదు అని అన్నాడు. ఆ తర్వాత ముగ్గురు జడ్డిలు కేసుకి సంబంధించి డిస్కస్ చేసుకుంటూ నవ్వుకున్నారు. ఓ పాయింట్ దగ్గర జస్టిస్ చంద్రచుడ్ గట్టిగా నవ్వారు. కేసు విచారణ సయయంలో జడ్జిల ప్రవర్తన హాలులో ఉన్నవారందరికి షాకింగ్‌గా మారింది. చివరిగా దీపక్ మిశ్రా ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్‌తో నటి ప్రియాంక, దర్శకుడు రిలీఫ్ అయిన సంగతి తెలిసిందే.

6233

More News

VIRAL NEWS