మ‌రో బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌బోతున్న ఎన్టీఆర్ దంప‌తులు..!

Sun,February 18, 2018 12:47 PM
jt ntr become father again

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి కాబోతున్నాడ‌నే వార్త దావానంలా పాకింది. ప్ర‌ణ‌తి, ఎన్టీఆర్ దంప‌తుల‌కి ఇప్ప‌టికే అభ‌య్ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఉండ‌గా, త్వ‌ర‌లో వారింట మ‌రో చిన్నారి అడుగు పెట్ట‌నున్నార‌ట‌. ప్ర‌ణ‌తి ప్ర‌స్తుతం ప్ర‌గ్నెంట్ అని స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనే ఎన్టీఆర్‌ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తాడ‌ని తెలుస్తుంది. త‌న సంతోషానికి అభ‌య్ కార‌ణ‌మ‌ని చెబుతున్న ఎన్టీఆర్ ఈ మ‌ధ్య వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతున్నాడు. రీసెంట్‌గా జైల‌వ‌కుశ చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసిన ఎన్టీఆర్ త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌తో మూవీ చేయ‌నున్నాడు. మార్చి నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇక ఈ ఏడాది చివ‌రిలో రాజ‌మౌళితో మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌చేయ‌నున్నాడు. మ‌రో వైపు బిగ్ బాస్ 2 రియాలిటీ షోని కూడా హోస్ట్ చేస్తాడ‌ని తెలుస్తుంది.

3364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles