HomeLATEST NEWSJr NTR Son Abhay Ram ay janatha garage set

ఎన్టీఆర్ తనయుడితో సమంత ..సరదాగా

Published: Tue,May 10, 2016 08:35 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ జనతా గ్యారేజ్ సెట్ లో సందడి చేసాడు. హైదరాబాద్ లోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండడంతో ఎన్టీఆర్ భార్య ప్రణతి, తనయుడు అభయ్ రామ్ షూటింగ్ లొకేషన్ కు వెళ్ళారు. వీరి రాకతో లొకేషన్ అంతా కాసేపు సందడిగా మారింది. యంగ్ టైగర్ అయితే తనయుడితో సెట్ లో చాలా సరదాగా గడిపాడు. ఇక సమంత అభయ్ ని ఎత్తుకొని ఆడించడం అక్కడి వారికి కనువిందును కలిగించింది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ సెట్ లో అభయ్ చేసిన హంగామాకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక జనతా గ్యారేజ్ సినిమా విషయానికి వస్తే, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారు. సమంత, మోహన్ లాల్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.



8562
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology