ద్వితీయార్ధంలో సిక్స్ ప్యాక్ చూపించ‌నున్న ఎన్టీఆర్‌

Wed,June 20, 2018 01:25 PM
jr ntr shows his six pack in second half

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం అర‌వింద స‌మేత‌. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హైద‌రాబాద్ శివార్ల‌లో ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

ప్ర‌ధ‌మార్ధంలో సిద్ధార్ధ్ గౌత‌మ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘ‌వగా క‌నిపించి అల‌రించనున్నాడ‌ట‌. సెకండాఫ్‌లో ఎన్టీఆర్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌డంతో పాటు ఇది పూర్తి రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ఉంటుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ కూడా ప్రద‌ర్శించ‌నున్నాడ‌ట‌. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపించ‌నున్న ఎన్టీఆర్‌, హైద‌రాబాద్ నేప‌థ్యంలో సాగే సున్నిత‌మైన పాత్ర‌లోను మెప్పిస్తాడ‌ని అంటున్నారు. చిత్రంలో ల‌వ్ ట్రాక్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయ‌ని చెబుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బ‌ని ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

2466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles