త‌న‌యుల ఫోటోలు షేర్ చేసిన ఎన్టీఆర్

Fri,June 14, 2019 10:49 AM
Jr NTR  shares his sons pics

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , లక్మీ ప్ర‌ణ‌తి దంపతులకి అభయ్ రామ్‌ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఉండగా, గ‌త ఏడాది జూన్ 14న మ‌రో కుమారుడు జ‌న్మించాడు. ఆ చిన్నారికి భార్గ‌వ్ రామ్ అని నామ‌క‌ర‌ణం చేసిన ఎన్టీఆర్ అప్ప‌ట్లో కంప్లీట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు. ఈ పిక్ నంద‌మూరి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. భార్గ‌వ్ నేడు తొలి బ‌ర్త్‌డే జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో అపురూప‌మైన ఫోటోలు షేర్ చేశాడు. ఒక ఫోటోలో భార్గ‌వ్‌ని ఎత్తుకొని ఎన్టీఆర్ ఉండ‌గా, మ‌రొక ఫోటోలో అభ‌య్, భార్గ‌వ్‌లు ఇద్ద‌రు క‌లిసి ఫోటోకి ఫోజిచ్చారు. ఈ ఫోటోలు ఫ్యాన్స్‌కి ఆనందాన్ని పంచుతున్నాయి. ఎన్టీఆర్ పెద్ద‌ కొడుకు అభయ్ రామ్ 2014 జులై 22 లో జన్మించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ మ‌ధ్య యాక్ష‌న్ సీన్‌లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నాడు. ప్ర‌స్తుతం తిరిగి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



3946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles