నీ నటనతో బంతి బౌండరీలు దాటింది: ఎన్టీఆర్‌

Fri,April 19, 2019 10:47 PM
Jr Ntr Praises Nani And Jersey Movie Team

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన‌ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ట్విటర్‌ వేదికగా నానితో పాటు జెర్సీ టీంపై ప్రశంసలు కురిపించాడు.

‘Bro నాని.. నీ అద్భుతమైన నటనతో బంతి బౌండరీలు దాటింది. అద్భుతం, అద్భుతం, అద్భుతం ! ఇదో అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో నీ నటనను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రోలర్‌ కోస్టర్‌లో రైడ్‌ చేసిన అనుభూతిని కలిగించింది. ఇలాంటి సబ్జెక్ట్‌ ఎంచుకుని దానిని పక్కాగా తెరకెక్కించిన గౌతం తిన్ననూరి ప్రతిభకు హాట్సాఫ్‌. అదే విధంగా గౌతం విజన్‌కు తగ్గట్లుగా నటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గౌతమ్‌ విజన్‌ను అర్థంచేసుకుని, ఆయనకు మద్దతిచ్చినందుకు చిత్రబృందానికి అభినందనలు’ అని తార‌క్ పేర్కొన్నారు.

2770
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles