మ‌హాన‌టి ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో

Tue,May 1, 2018 11:05 AM
jr ntr chief guest for mahanati

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌చ్ ఎవైటెడ్ మూవీ మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కింది ఈ చిత్రం. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌ రాజ్, షాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్ర‌ల‌లో ప్రియాంక ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మే 9న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా జ‌రుగుతున్నాయి. ఒక‌వైపు చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్‌తో పాటు ఆడియో సాంగ్స్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సాంగ్స్ విడుద‌ల చేసిన యూనిట్ ఈ రోజు జ‌ర‌గ‌నున్న ఆడియో ఈవెంట్‌లో మిక్కీ జే మేయ‌ర్ స‌మ‌కూర్చిన‌ మిగ‌తా సాంగ్స్ రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఈ ఆడియో ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రు కానున్నాడ‌ట‌. చిత్ర నిర్మాత స్వ‌ప్న ద‌త్‌కి ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కావ‌డంతో మ‌హాన‌టి ఈవెంట్‌కి వచ్చేందుకు ఆయ‌న సుముఖత చూపార‌ట‌. గ‌తంలో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఆడియో వేడుక‌కి కూడా ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్నారు.




2603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles