పాట చిత్రీక‌ర‌ణ‌లో బిజీ అయిన ఎన్టీఆర్‌

Tue,September 4, 2018 09:39 AM
jr ntr busy with aravinda sametha

జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంతో మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. హ‌రికృష్ణ మ‌ర‌ణం ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌లు ఆ షాక్ నుండి ఇంకా బ‌య‌ట‌ప‌డిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. అయితే కుటుంబ స‌మ‌స్య‌లు ఎన్ని ఉన్నా నిర్మాత‌ల‌ని ఇబ్బంది పెట్టొద్ద‌ని భావించిన అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రు తాము ఒప్పుకున్న ప్రాజెక్టుల కోసం దుఃఖాన్ని దిగ‌మింగుకొని షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఎన్టీఆర్ న‌టిస్తున్న అర‌వింద స‌మేత చిత్రం అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలో త‌న వ‌ల‌న షూటింగ్ ఆల‌స్యం కాకూడ‌ద‌ని హ‌రికృష్ణ మర‌ణించిన నాలుగో రోజు నుండే ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన గుడి సెట్ లో జరుగుతుంది. ఈ సెట్లో చిత్ర బృందం ఫై ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూర్ యాస లో మాట్లాడుతారట. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హాసిని హారిక క్రియేషన్స్ నిర్మిస్తుంది . షూటింగ్‌తో పాటు డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు.

3512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles