మ‌రోసారి మగబిడ్డకి జ‌న్మనిచ్చిన ఎన్టీఆర్ భార్య‌

Thu,June 14, 2018 01:50 PM
Jr Ntr becomes father again

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్మీ ప్ర‌ణ‌తి కొద్ది సేప‌టి క్రితం పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది. ప్రణతి, ఎన్టీఆర్ దంపతులకి ఇప్పటికే అభయ్ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఉండగా, మ‌రోసారి వారికి కుమారుడే పుట్టాడు. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. బేబీ బాయ్ తో మా ఫ్యామిలీ పెద్దదైంది అంటూ ట్వీట్ చేశాడు. నంద‌మూరి ఫ్యామిలీలోకి మ‌రొక‌రు జాయిన్ కావ‌డంతో ఆ ఇంట సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి. ఎన్టీఆర్‌కి కుమారుడు పుట్టాడ‌ని తెలుసుకున్న అభిమానులు, సెల‌బ్రిటీలు ఆయ‌నకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ అర‌వింద స‌మేత చిత్రంతో బిజీగా ఉన్నాడు. నిన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన ఎన్టీఆర్ తొలి ఫోటోగా అరవింద స‌మేత ఫ‌స్ట్ లుక్ ఫోటో పెట్టి డిలీట్ చేశాడు. ఇలా ఎందుకు చేశాడా అని అభిమానులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. అయితే తాజా వార్త‌తో అభిమానుల‌లో ఓ క్లారిటీ వ‌చ్చింది. తొలి ఫోటోగా బుల్లి ఎన్టీఆర్ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేందుకే యంగ్ టైగ‌ర్ ఇలా చేశాడా అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.


4614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles