ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నాడు..

Fri,March 2, 2018 04:04 PM
Jr Ntr  become father

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త ఇటీవల దావానంలా పాకిన సంగతి తెలిసిందే. ప్రణతి, ఎన్టీఆర్ దంపతులకి ఇప్పటికే అభయ్ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఉండగా, త్వరలో వారింట మరో చిన్నారి అడుగు పెట్టనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయే సరికి అభిమానులు ఈ వార్తని లైట్ గా తీసుకున్నారు. కాని తాజాగా ఓ ఫంక్షన్ లో బేబి బంప్ తో మెరిసింది ప్రణతి. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మురిసిపోయారు. నందమూరి ప్యామిలీలోకి మరో ఆణిముత్యం రాబోతుందంటూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

అయితే అభయ్ రామ్ కి తమ్ముడు పుడతాడా, చెల్లి పుడుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేలో ప్రణతి మరో బేబికి జన్మనివ్వనుందని సమాచారం. ఇక ఎన్టీఆర్ ఈ నెలలో త్రివిక్రమ్ తో కలిసి తన సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. మే వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి ఆ తర్వాత కొన్ని రోజులు ఫ్యామిలీతో ఆనంద క్షణాలు గడుపుతాడట. ఇక ఈ ఏడాది చివరిలో రాజమౌళితో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్చేయనున్నాడు ఎన్టీఆర్. మరో వైపు బిగ్ బాస్ 2 రియాలిటీ షోని కూడా హోస్ట్ చేస్తాడని తెలుస్తుంది.

7215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles