నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు

Sat,May 20, 2017 08:31 AM
Jr N T Rama Rao birthday

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం నేడు. నందమూరి తారకరామారావు(జూనియర్) ఇవాళ 34వ పడిలోకి అడుగిడుతున్నారు. కుటుంబ సభ్యులు, సినీ నటీనటులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కేక్‌కట్ చేసి వేడుకలు జరుపుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జై లవకుశ. ఈ మూవీలో ఎన్టీఆర్ తొలి సారి మూడు విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా థామ‌స్, రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. నంద‌మూరి ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఈ లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందిస్తుంది. పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ రౌద్రం, రాజసం క‌ల‌గ‌లిపిన రావ‌ణుడిగా క‌నిపిస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ నెగెటివ్ లుక్ అని అంటున్నారు. ఆగ‌స్ట్ రెండో వారంలో విడ‌దుల కానున్న ఈ చిత్రంపై తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్స్ భారీ హైప్స్ తెచ్చాయి.

1889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS