షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ నాని.. జ‌ర్నీ ఆఫ్ జెర్సీ వీడియో

Sat,March 30, 2019 09:57 AM

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ధాన పాత్ర‌లో గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కిస్తున్న చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి అనురుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాని అర్జున్ పాత్రలో నటిస్తుండ‌గా, ఆయ‌న సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా చిత్రీక‌ర‌ణ‌కి సంబంధించిన విశేషాల‌ని ‘జర్నీ ఆఫ్ జెర్సీ’ వీడియో రూపంలో వదిలారు. ఇందులో నాని క్రికెట‌ర్‌గా మారేందుకు ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో చూపించారు. అంతేకాదు ఒకానొక సంద‌ర్భంలో బాల్ నాని ముక్కుకి త‌గిలి బ్ల‌డ్ రావ‌డం కూడా వీడియోలో ప్ర‌త్యేకంగా చూపించారు. 70 రోజులు నాని క్రికెట్‌లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్టు వీడియో ద్వారా తెలిపారు. 250 మంది చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రం కోసం 130 మంది ప్రొఫెషనల్ క్రికెట్ క్రీడాకారులు పని చేశారని.. వారిలో 18 మంది ఇంగ్లండ్‌కు చెందిన క్రీడాకారులున్నట్టు చిత్రబృందం తెలిపింది. తాజాగా విడుద‌లైన జ‌ర్నీ ఆఫ్ జెర్సీ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles