దేవ‌దాస్ జ‌ర్నీ ఎలా సాగిందో ఈ వీడియోలో చూడండి

Sat,October 6, 2018 09:18 AM
Journey Of Devadas Special Video

కథ నచ్చితే నవతరం హీరోలతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉండే హీరోల‌లో నాగ్ ఒక‌రు. కెరీర్ తొలినాళ్ల నుంచి వినూత్న కథాంశాలతో సినిమాలు చేస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు నాని. వీరిద్దరి కలయికలో రూపొందిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. క్లాసిక్ టైటిట్‌తో ఇద్దరూ అగ్ర కథానాయకులు కలిసి నటించిన ఈ చిత్రంపై ప్రారంభం నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. భలేమంచిరోజు, శమంతకమణి సినిమాలతో ప్రతిభను నిరూపించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహానటి విజయం తర్వాత వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు అభిమానుల ఆద‌ర‌ణ‌ని పొందింది. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన వీడియోలు విడుద‌ల చేస్తూ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచుతున్నారు మేక‌ర్స్‌. తాజ‌గా దేవదాస్ ప్ర‌యాణం మొద‌టి నుండి చివ‌రి వ‌ర‌కు ఎలా సాగిందో వీడియోలో చూపించారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles