'అంత‌రిక్షం' మేకింగ్ వీడియో

Tue,December 25, 2018 09:50 AM
Journey Of Antariksham

వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావు హైద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్‌‌గా ఈ చిత్రంలోని సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌‌పై చిత్రీకరించారు. హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ రూపొందింది. జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం. చిత్రంలో దేవ్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపించ‌గా, రియా పాత్ర‌లో అదితి రావు హైద‌రి, పార్వ‌తి పాత్ర‌లో లావ‌ణ్య త్రిపాఠి సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ‘జర్నీ ఆఫ్ అంతరిక్షం’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో సినిమా బిహైండ్‌ సీన్స్‌ని చూపించారు. ఈ వీడియో సినిమా ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

1854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles