వరదల్లో చిక్కుకున్న ‘జర్నీ’ హీరోయిన్..

Mon,August 20, 2018 05:16 PM
journey actress ananya trapped in kerala floods

తిరువనంతపురం: పదకొండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కేరళ రాష్ర్టాన్ని అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. జల ప్రళయం ధాటికి ఇప్పటివరకు 350 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. జర్నీ ఫేం నటి అనన్య కూడా వరదల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.

నా ఇంటితోపాటు మా బంధువుల ఇండ్లు వరదల్లో చిక్కుకున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మేమంతా సురక్షితంగా బయటపడ్డాం. ప్రస్తుతం మేమంతా పెరుంబవూర్‌లోని ఆశా శరత్ (భాగమతి నటి) ఇంట్లో తలదాచుకున్నాం. మేమంతా సురక్షితంగా ఉన్నాం. నన్ను నా కుటుంబాన్ని రక్షించేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. సహాయం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రతీ ఒక్కరూ సాయమందిచాలని అనన్య కోరింది.

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు త్రివిధ దళాలు ఎన్టీఆర్‌ఎఫ్, కోస్ట్ర్ గార్డ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కేరళ వరదలతో 7.24 లక్ష మంది నిరాశ్రయులయ్యారు. ఎన్టీఆర్‌ఎఫ్, కోస్ట్ర్ గార్డ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొని ఆదివారం ఒక్క రోజే 22 వేల మందిని సురక్షితంగా కాపాడారు.

8572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles