ఆస్కార్ అకాడమీ చీఫ్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు..!

Sat,March 17, 2018 04:46 PM
john Bailey Accused of Sexual Harassment

ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీస్ లో లైంగిక వేధింపులపై పెద్ద ఉద్యమాలు లేవనెత్తుతున్నారు. ఆ మధ్య హాలీవుడ్ నిర్మాత వైన్ స్టీన్ పలువురు మహిళలని లైంగికంగా వేధించిన కారణంగా, పలువురు హీరోయిన్స్ ఆయనపై ఫిర్యాదులు చేశారు. మీ టూ అనే పేరుతో ఓ ఉద్యమం కూడా చేశారు. బాలీవుడ్ లోను లైంగిక వేధింపులకి గురైన మహిళలు పలు సందర్భాలలో ఆవేదనని తెలియజేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అందరం నడుం బిగించాలని పిలుపు కూడా ఇస్తున్నారు. కట్ చేస్తే లైంగిక ఆరోపణల ఉచ్చులో ఆస్కార్ అకాడమీ ప్రెసిడెంట్ చిక్కుకున్నాడు.

గత ఏడాది ఆగస్ట్ లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడిగా ఎంపికైన జాన్ బైలీపై మూడు లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్టు పలు కథనాలు వస్తున్నాయి. అధ్యక్షుడి కంటే ముందు సినిమాటోగ్రాఫర్ గా అమెరికన్ గిగోలో, ది బిగ్ చిల్ , గ్రౌండ్ హోగ్ డే వంటి సినిమాలకి పనిచేశారు బైలీ. అధ్యక్షుడికి సంబంధించి వస్తున్న వార్తలపై కమిటీ మెంబర్స్ పూర్తిగా సమీక్షించి ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కి రిపోర్ట్ చేయనుంది. దీనిపై పూర్తి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎలాంటి కామెంట్ చేయబోమని అకాడమీ అంటుంది. ఒకవేళ బైలీ తప్పుచేశాడని తెలిస్తే అతని ప్లేస్ లో వెటరన్ మేకప్ ఆర్టిస్ట్ లూయిస్ బుర్ వెల్ అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుతం లూయిస్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. జూలై ఎలక్షన్స్ వరకి ఇతనినే అధ్యక్షుడిగా నియమిస్తామని కమిటీ అంటుంది.

ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే ఆస్కార్ పండుగ ఈ సారి లాస్ ఏంజెల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో మార్చి 4న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 90వ ఆస్కార్ అవార్డుల వేడుకకి ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఉత్తమ నటుడిగా గ్యారీ ఓల్డ్ మాన్ (డార్కెస్ట్ హవర్), ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్ మెక్ డార్మమండ్ (త్రి బిల్బోర్డ్స్ ఔట్సైడ్ ఎబింగ్, మిసోరి) సొంతం చేసుకున్నారు. ‘ద షేప్ ఆఫ్ వాటర్’ సినిమాకు గాను గిలెర్మో డెల్ టోరో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా ద షేప్ ఆఫ్ వాటర్ కి ఆస్కార్ అవార్డ్ వరించిన విషయం విదితమే.

1254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS