వేద‌లం రీమేక్‌లో జాన్ అబ్ర‌హం..!

Fri,June 14, 2019 12:53 PM
John Abraham Fto remake tamil movie

ప్ర‌స్తుత ప‌రిస్థితులని చూస్తుంటే బాలీవుడ్‌లో రీమేక్‌ల ట్రెండ్ న‌డుస్తున్నట్టుగా అర్ధ‌మ‌వుతుంది. ముఖ్యంగా సౌత్ సినిమాల‌ని రీమేక్ చేస్తూ మంచి స‌క్సెస్‌లు సాధిస్తున్న నార్త్ ఫిలిం మేక‌ర్స్ ఇప్ప‌టికే ప‌లు రీమేక్ ప్రాజెక్టులని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. త్వ‌ర‌లో మ‌రో రీమేక్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ధ‌మైంది. తమిళంలో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన వేదాలం సినిమాలో నటించేందుకు జాన్ అబ్ర‌హం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తమిళ సూపర్‌స్టార్ అజిత్ నటించిన వేదాలం యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రం గా నిలిచింది. చిత్ర స్టోరీ లైన్ జాన్‌కి ఎంత‌గానో న‌చ్చ‌డంతో ఆయ‌న ఈ రీమేక్‌లో న‌టించేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ట‌. చిత్రంలో జాన్ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. భూష‌ణ్ కుమార్ వేదాలం హిందీ రైట్స్ ఇప్ప‌టికే ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని ఎవ‌రు తెర‌కెక్కించ‌నున్నారు. న‌టీన‌టులు ఎవ‌ర‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. గ‌తంలో వేదాలం చిత్రాన్ని ప‌వ‌న్ రీమేక్ చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles