విజయ్ దేవ‌ర‌కొండ ప్లేస్‌లో జీవా..!

Tue,January 8, 2019 10:39 AM
Jiiva To Replace Vijay Deverakonda In 83

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మార్కెట్ వాల్యూ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్, కోలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు ఈ కుర్ర హీరో. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజులుగా క‌పిల్ దేవ్ బ‌యోపిక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడంటూ ప్ర‌చారం జ‌రిగింది. కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌ని విజ‌య్ చేయ‌నున్నాడ‌ని ఈ చిత్రంతో విజ‌య్ బాలీవుడ్ ఆరంగేట్రం చేయ‌నున్నాడ‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. కాని వీట‌న్నింటిని చిత్ర యూనిట్ కొట్టి పారేసింది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప్లేస్‌లో జీవా న‌టించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కొన్నాళ్ళుగా స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న జీవాకి ఈ చిత్రం మంచి బూస్ట‌ప్ ఇస్తుందని అంటున్నారు. ఈ చిత్రంతో జీవా బాలీవుడ్ డెబ్యూ ఇవ్వ‌నున్నాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న మ‌రి కొన్ని ప్రాజెక్టులు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్నాయి.

లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ బ‌యోపిక్ 83 అనే టైటిల్‌తో రూపొంద‌నుండ‌గా, ఈ చిత్రం క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది . ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్క‌నుంది. 2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రం 83 అనే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు.

4757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles