హిందీలో రీమేక్ కానున్న జిగ‌ర్తాండ చిత్రం

Sun,July 21, 2019 11:50 AM
Jigarthanda to be remake in Hindi

సిద్ధార్ద్‌, బాబీ సింహా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ్రా. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప‌లు జాతీయ అవార్డుల‌ని కూడా సొంతం చేసుకుంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రీమేక్ చేస్తుంది . వాల్మీకి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగు నేటివిటికి అనుగుణంగా ఈ చిత్రం రూపొందుతుంది. తెలుగు రీమేక్‌లో బాబీ సింహా పాత్ర‌ని వ‌రుణ్ తేజ్ పోషిస్తుండ‌గా, సిద్ధార్ద్ పాత్ర‌ని అధ‌ర్వ పోషిస్తున్నాడు.

జిగ‌ర్తాండ చిత్రం ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ కానుంద‌ని తాజా స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాత సాజిద్ న‌డియావాలా ఈ చిత్ర రీమేక్ రైట్స్ ద‌క్కించుకోగా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట‌. అభిషేక్ చౌబే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎవ‌రెవ‌రిని ఎంపిక చేశార‌నేది త్వ‌రలోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

1084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles