టాలీవుడ్‌లో స్టార్ హీరోతో జ‌త‌క‌ట్ట‌నున్న జాన్వీ

Wed,July 25, 2018 11:19 AM
Jhanvi Kapoor tollywood entry with star hero

అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ ద‌డ‌క్ సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. సైర‌త్ అనే చిత్రానికి రీమేక్‌గా ద‌డ‌క్ చిత్రం రూపొందింది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌డుతుంది. ఇంటా బ‌య‌టా అనే తేడా లేకుండా ఈ చిత్రానికి అంత‌టా మంచి కలెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. ముఖ్యంగా చిత్రంలో జాన్వీ న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. త‌ల్లి న‌ట‌వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న జాన్వీ రానున్న రోజుల‌లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా మారుతుంద‌ని చెప్పుకొచ్చారు. అయితే జాన్వీ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయ్యే స‌మ‌యం ఎంతో దూరంలో లేద‌ని తెలుస్తుంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు.. జాన్వీని టాలీవుడ్‌లో ప‌రిచయం చేసే బాధ్య‌త‌ని తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. శ్రీదేవికి తెలుగులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌డంతో ఆమె కూతురిని కూడా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగేలా చేయాల‌ని బోనీ క‌పూర్ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో బోనీ.. దిల్ రాజుని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. తెలుగులో జాన్వీ చేయ‌బోవు తొలి చిత్రం స్టార్ హీరోతో ఉంటుంద‌ని టాక్‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

3333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS