శ్రీదేవి ఇచ్చిన సలహా ఏంటో చెప్పిన జాన్వీకపూర్

Fri,July 13, 2018 05:54 PM
jhanvi kapoor says what suggesion sridevi gave to her

ముంబై: సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించకముందే చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది జాన్వీకపూర్. నటనలో అలనాటి అందాల తార శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తూ ధఢక్ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది జాన్వీ. ఈ సందర్భంగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది జాన్వీ. ఇంటర్వ్యూలో సినిమాలకు సంబంధించి తనకు తల్లి శ్రీదేవి ఇచ్చిన సలహాను పంచుకుంది.

మంచి నటిగా పేరు తెచ్చుకోవాలంటే ముందుగా గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీని కలిగియుండాలని అమ్మ చెప్పింది. నీ మనసులో ఏమైనా ప్రతికూల ఆలోచనలున్నా, నిజాయితీ లేకున్నా నీవు చేయాలనుకున్న పాత్రను చేయలేవని అమ్మ చెప్పేది. ఎలాంటి సన్నివేశంలోనైనా నాకు సాయం చేయాలనుకునేది కాదు. నాకు నేనే ఆ పాత్రలో ఒదిగిపోయేలా ఉండాలనుకునేది. ఏ పాత్ర అయినా నా సొంత శైలిలోనే చేసేలా ఉండాలనేది అమ్మ ఆలోచనని చెప్పింది జాన్వీ. ఇషాన్ ఖట్టర్, జాన్వీకపూర్ కాంబినేషన్ లో వస్తున్న ధఢక్ ఈ నెల 20న విడుదల కానుంది.

4101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles