షారుక్‌కు అవార్డు అందజేసిన జాన్వీకపూర్..వీడియో వైరల్

Wed,June 20, 2018 05:33 PM
jhanvi kapoor presenting award to shahrukh goes viral

ముంబై: దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ధఢక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ట్రైలర్‌లో జాన్వీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తొలి సినిమా విడుదల కాకముందే తన అందంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది జాన్వీ.

తాజాగా జాన్వీకపూర్ బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్‌కు అవార్డు ప్రదానం చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అవును మీరు విన్నది నిజమే. కానీ ఈ వీడియో ఇప్పడిది కాదు. 2002లో దేవ్‌దాస్ చిత్రంలో నటనకు గాను షారుక్‌కు ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ప్రీతి జింటా వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

ప్రీతి జింటా అవార్డును అందజేసేందుకు బోనీకపూర్, జాన్వీకపూర్‌ను స్టేజీపై ఆహ్వానించింది. ప్రీతి జింటా, జాన్వీకపూర్ ఉత్తమ నటుడుగా షారుక్ పేరును ప్రకటించారు. ఆ తర్వాత జాన్వీకపూర్ షారుక్‌కు అవార్డును ప్రదానం చేసింది. అవార్డు తీసుకున్న తర్వాత షారుక్‌ జాన్వీ చెంపలపై ముద్దు పెట్టాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


1635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS