శ్రీదేవి కూతురితో విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రం..!

Wed,September 26, 2018 11:23 AM
jhanvi kapoor next with vijay

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టించిన నోటా చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా విజ‌య్ త‌ర్వాతి చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ఓ త‌మిళ ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర్వాతి మూవీ తెర‌కెక్క‌నుండ‌గా ,ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. చిత్రంలో క‌థానాయిక‌గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ధ‌డ‌ఖ్ చిత్రంతో అల‌రించిన జాన్వీ ప్ర‌స్తుతం త‌క్త్ అనే మూవీ చేస్తుంది. ఇటీవ‌ల జాన్వీని క‌లిసి చిత్ర బృందం స్టోరీ లైన్ వినిపించ‌గా, దీనికి ఇంప్రెస్ అయిన ఈ అమ్మ‌డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో విజ‌య్‌కి ఇటు సౌత్ అటు నార్త్‌లో ఫుల్ క్రేజ్ రావ‌డంతో విజ‌య్‌తో న‌టించేందుకు జాన్వీ సిద్ధంగా ఉంటుందట‌. మ‌రి త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుందట‌. అర్జున్ రెడ్డి హిందీ వ‌ర్షెన్‌లో షాహిద్ క‌పూర్‌, కైరా అద్వానీ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

3856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS