వైర‌ల్ అవుతున్న జాన్వీ రిహార్స‌ల్ వీడియో

Wed,January 23, 2019 11:59 AM

దివంగ‌త న‌టి శ్రీదేవి కూతురు జాన్వీ ధడక్ అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జాన్వీ ప్ర‌స్తుతం త‌క్త్ అనే చిత్రంతో బిజీగా ఉంది. మ‌ల్టీ స్టార‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే త‌న తల్లి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకున్న జాన్వీ న‌ట‌న‌లోనే కాదు డ్యాన్స్‌లోను త‌ల్లికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంటుంది. త్వ‌ర‌లో తాను పాల్గొన‌బోయే ఓ ఈవెంట్ కోసం కొరియోగ్రాఫ‌ర్‌తో రిహార్స‌ల్ చేస్తుంది జాన్వీ. క‌థ‌క్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోని కొరియోగ్రాఫ‌ర్ సంజ‌య్ శెట్టి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు జాన్వీపై ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే కాకుండా శ్రీదేవిని గుర్తు చేస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇదిలా ఉంటే ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా ప్లాన్ చేయగా ,ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. చిత్రంలో క‌థానాయిక‌గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌.


2962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles