టెంపర్ రీమేక్ లో అతిలోక సుందరి కుమార్తె..!

Sat,January 27, 2018 09:48 AM
JHANVI KAPOOR heroine for simba remake

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దడక్ అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే . షాహిద్ కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్ తో జాన్వీ ఈ చిత్రంలో జతకట్టింది. జూలై 20న విడుదల కానున్న ఈ చిత్రం సూపర్ హిట్ మరాఠి చిత్రం సైరత్ కు రీమేక్ గాతెరకెక్కుతుంది . దడక్ చిత్రం శశాంక్ కైతాన్ డైరెక్షన్లో రూపొందుతుండగా, ఈ మూవీ విలేజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. ఆ మధ్య చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా ఇందులో జాన్వీని చూసిన ప్రతి ఒక్కరు అచ్చం శ్రీదేవిలానే ఉందని ప్రశంసలు కురించారు. మరోవైపు దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి ఆఫర్స్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ టెంపర్ ని హిందీలో రోహిత్ శెట్టి రీమేక్ చేయనుండగా, ఇటీవల చిత్ర టైటిల్ తో ఫస్ట్ లుక్ తో పోస్టర్ విడుదల చేశారు. సింబా అనే టైటిల్ తో మూవీ రూపొందనుంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీని తీసుకోవాలని భావిస్తున్నారట నిర్మాతలు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.

1760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles