అన్న‌య్య‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన జాన్వీ

Tue,June 26, 2018 12:07 PM
Jhanvi Kapoor birthday wishes to her  brother

బోని క‌పూర్‌, శ్రీదేవిల‌ గారాల పట్టి జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లో ద‌ఢఖ్ సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే. త‌ల్లి మ‌ర‌ణంతో పూర్తిగా కుంగిపోయిన జాన్వీ ఆ త‌ర్వాత తేరుకొని షూటింగ్ పూర్తి చేసింది. జూలై 20న జాన్వీ డెబ్యూ మూవీ ద‌ఢ‌ఖ్ చిత్రం విడుద‌ల కానుంది. అయితే తొలి సినిమా కూడా విడుద‌ల కాక‌ముందే ఈ అమ్మ‌డికి విప‌రీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అభిమానులే కాదు మీడియా కూడా జాన్వీపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతుంది. ఆ మ‌ధ్య ఓ వెబ్ సైట్ పొట్టి డ్రెస్ ధరించిన జాన్వీ ఫోటో పోస్ట్ చేసి, ఆమె ఏదో వేసుకోవ‌డం మ‌రచిపోయింద‌నే కామెంట్‌తో ఓ శీర్షిక ప్ర‌చురించింది. ఇది అర్జున్ క‌పూర్ కంట ప‌డ‌డంతో వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. పెద్ద ప‌త్రిక విమ‌ర్శ‌కుల‌కి ఇంత‌ ప్రాముఖ్య‌త ఇవ్వ‌డం హాస్యాస్ప‌దంగా ఉంది. ఇలాంటి వార్త‌ల‌ని త‌గ్గించ‌డం వ‌ల‌న విమ‌ర్శ‌కుల‌ని మీరు త‌గ్గించిన వారు అవుతారు అని అన్నారు.

త‌న పిన్ని శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత అర్జున్ క‌పూర్.. జాన్వీ, ఖుషీల‌ని సొంత అన్న‌లా చూసుకుంటున్నాడు. వారికి ఏ లోటు రాకుండా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నాడు . త‌మ‌ని సొంత అన్న‌య్య‌లా చూసుకుంటున్న అర్జున్ క‌పూర్ బ‌ర్త్‌డే నేడు కావ‌డంతో జాన్వీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాస్త ఎమోష‌న‌ల్‌గా మెసేజ్ పెట్టింది. `నువ్వే మా బ‌లం. మా ధైర్యానికి నువ్వే కార‌ణం. ల‌వ్యూ. హ్యాపీ బ‌ర్త్ డే అర్జున్ భ‌య్యా` అంటూ ఆయ‌న‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ విషెస్ తెలియ‌జేసింది. అన్షులా కపూర్ కూడా త‌న అన్న‌య్య‌కి విషెస్ చెబుతూ.. ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌, నువ్వు మా వెన్నంటే ఉన్నావు. ఎప్పుడు ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాని ట్వీట్ చేసింది. బోనీ మొద‌టి భార్య సంతానం అర్జున్‌, అన్షులా క‌పూర్ అన్న సంగ‌తి తెలిసిందే.


2928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles