ఆస‌క్తి రేపుతున్న 'జెస్సీ' ఫ‌స్ట్ లుక్

Tue,February 12, 2019 08:07 AM
jessie telugu movie first look released

టాలీవుడ్‌లో థ్రిల్ల‌ర్ చిత్రాల‌కి ఆద‌ర‌ణ పెరుగుతూ వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో హ‌ర‌ర్ జాన‌ర్‌లో సినిమాలు చేస్తున్నారు. ప్రేమ క‌థా చిత్ర‌మ్‌కి సీక్వెల్‌గా ప్రేమ్ కథా చిత్ర‌మ్ 2 అనే హ‌ర‌ర్ మూవీ ప్ర‌స్తుతం సెట్స్ పై ఉండ‌గా నూత‌న ద‌ర్శ‌కుడు అశ్విని కుమార్.వి ‘జెస్సీ’ అనే మ‌రో హ‌ర‌ర్ చిత్రాన్ని మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ అర్చన, అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ఇ ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై శ్వేతా సింగ్ నిర్మించారు. చిత్ర రిలీజ్‌కి మ‌రి కొద్ది రోజుల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. తాజాగా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసిన చిత్ర బృందం త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తుంది. ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుందని యూనిట్ చెబుతుంది.

1218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles