జెర్సీ టీజ‌ర్‌తో అల‌రిస్తున్న నాని

Sat,January 12, 2019 12:17 PM
Jersey teaser released

నేచుర‌ల్ స్టార్ నాని, మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌మూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ న్యూ ఇయ‌ర్ కానుక‌గా జ‌న‌వ‌రి 1న విడుద‌లైంది. ఇక సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో కొద్ది సేప‌టి క్రితం చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నాని క్రికెట‌ర్‌గా అద‌ర‌గొట్టాడు. ఈ సినిమా నానికి మ‌రో మంచి హిట్ అందించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు చెబుతున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న జెర్సీ చిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని క్రికెట్లో చాలా శిక్షణ తీసుకున్నాడ‌ని అన్నారు . నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. నాని ఈ చిత్రంతో పాటు విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

2406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles