నాని 'జెర్సీ' వ‌చ్చేదెప్పుడో తెలుసా ?

Sat,November 24, 2018 08:16 AM

నేచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌ల దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క్రికెట్ నేప‌థ్యంలో జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు. అర్జున్ అనే పాత్ర‌లో నాని క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 19న విడుద‌ల కానుంద‌ని నాని త‌న ట్వీట్‌లో తెలిపారు. ‘19 ఏప్రిల్ 19 హార్ట్‌వార్మింగ్ సమ్మర్ రాబోతోంది. ప్రామిస్’ అంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, నాని ట్వీట్ చేసిన పోస్టర్‌లో సినిమా విడుదలకు ఇంకా 146 రోజులు ఉందని సూచన ప్రాయంగా కూడా చెప్పారు.


దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 17న లాంఛనంగా ప్రారంభం అయిన జెర్సీ సినిమాని గౌత‌మ్ తిన్న‌నేరి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నానికి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్, రెబా మోనికా జాన్‌‌లు నటిస్తున్నారు. సత్యరాజ్, రోనిత్ కుమార్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా.. సాను వర్ఘీస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

1236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles