జెర్సీ సినిమాపై అనుష్క కామెంట్

Tue,April 30, 2019 08:08 PM
Jersey giving an amazing experience says anushkashetty


న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాపై తన స్పందనను తెలియజేసింది టాలీవుడ్ హీరోయిన్ అనుష్క. ఇటీవలే ఈ సినిమాను చూసిన అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా జెర్సీ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘జెర్సీ’ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఈ చిత్రంలోని మ్యాచ్‌ చూశాక నేను పొందిన అనుభూతిని వివరించేందుకు మాటలు రావట్లేదు. నిజంగా ఇది నాకు ఫ్యాన్‌ మూమెంట్‌. నాని, డైరెక్టర్ గౌతమ్, చిత్ర చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు అని అనుష్క కామెంట్స్ పోస్ట్ చేసింది. నాని, శ్రద్దాశ్రీనాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

3939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles