రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదంపై జీవిత వివ‌ర‌ణ‌-వీడియో

Wed,November 13, 2019 12:22 PM

సినీ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం రాత్రి రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదానికి గురి కాగా, ఆ స‌మ‌యంలో మూడు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావ‌డంతో ఆయ‌నకి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. వెంట‌నే మ‌రో కారులో త‌న ఇంటికి చేరుకున్నారు. అయితే రాజశేఖ‌ర్ కారు ప్ర‌మాదంపై ఆయ‌న భార్య జీవిత వీడియో ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదు. ఆర్ఎఫ్‌సీ నుండి వ‌స్తున్న స‌మ‌యంలో కారు టైర్ బ్లాస్ట్ కావ‌డం వ‌ల‌న డివైడ‌ర్‌ని ఢీకొని కారు ప‌క్క‌కి వెళ్ళింది. వెనుక వ‌స్తున్న వారు గ‌మనించి రాజ‌శేఖ‌ర్‌ని కారులో నుండి బ‌య‌ట‌కి తీసారు. రాజ‌శేఖ‌ర్ ఫోన్ స్విచ్చాఫ్ కావ‌డం వ‌ల‌న త‌న‌ని సేఫ్ చేసిన వారి ద‌గ్గ‌ర ఫోన్ తీసుకొని ముందు పోలీసులకి స‌మాచారం అందించారు. ఆ త‌ర్వాత మాకు ఫోన్ చేసి ఎదురు ర‌మ్మ‌ని చెప్ప‌డంతో, మేము వెంట‌నే వెళ్ళాం. ఆయ‌న‌ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించాం. పోలీసుల‌తో పూర్తి విష‌యం వివ‌రించాం. వారితో ట‌చ్‌లోనే ఉన్నాం. కోలుకున్న త‌ర్వాత స్టేష‌న్‌కి వ‌చ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాల‌ని అన్నారు. త‌ప్ప‌క‌ వ‌స్తామ‌ని అన్నాం. జ‌రిగింది ఇది. మేజ‌ర్ యాక్సిడెంట్ అయిన‌ప్ప‌టికి అభిమానుల ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనురాగాల వ‌ల‌న రాజ‌శేఖ‌ర్ గారు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. మీ అంద‌రికి ధ‌న్య‌వాదాలు అని జీవిత పేర్కొన్నారు.

2805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles