మణిరత్నం సినిమాలో సహజనటి..!

Tue,November 14, 2017 11:43 AM
jayasudha plays important role in mani ratnam movie

మరపురాని మేలిమి ముత్యాల్లాంటి సినిమాల్ని తీస్తున్న దర్శకుడు మణిరత్నం. ఎన్నో ఆణిముత్యాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. రీసెంట్గా చెలియా సినిమాని తెరకెక్కించిన మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఓ మల్టీస్టారర్‌ని ప్లాన్ చేశాడు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు కూడా కీలక పాత్రలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు టాక్.

మణిరత్నం- అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన రోజా, దళపతి, బొంబాయి మరియు కాదల్ వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్‌లతో పనిచేయడం మణిరత్నంకిదే తొలిసారి. సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నాడు. ఇక సహజ నటి జయసుధ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనుందని తెలుస్తుంది.. నేచురల్ స్టార్ నాని కూడా మణిరత్నం మల్టీ స్టారర్ లో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.


1555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles