జ‌య‌ల‌లిత పాత్ర‌లో కంగ‌నా ర‌నౌత్‌

Sat,March 23, 2019 01:15 PM
Jayalalitha BIOPIC WITH thalivi title

సంచ‌ల‌నాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌ల మ‌ణిక‌ర్ణిక అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో కంగ‌నా న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు జేజేలు ప‌లికారు. ప్ర‌స్తుతం తాను జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ద‌మైంది. త‌లైవీ అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని విజ‌య్ తెర‌కెక్కించ‌నున్నాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. మ‌రోవైపు తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. నిత్యామీన‌న్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, పేపర్ టేల్ పిక్చర్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌,భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది జ‌య‌ల‌లిత‌. అమ్మ‌గా, పురుచ్చతలైవీగా అభిమానులతో పిలిపించుకున్న జ‌య‌ల‌లిత భార‌త రాజ‌కీయాల‌లోను ముఖ్య భూమిక పోషించింది. దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది.


997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles