జ‌య‌ల‌లిత బయోపిక్‌కి టైటిల్ ఖరారు

Fri,September 21, 2018 10:53 AM
jayalalitha Biopic title revealed

త‌మిళ‌నాడు ఐర‌న్ లేడీగా, అమ్మ‌గా, పురుచ్చతలైవీగా త‌మిళ తంబీల‌తో పిలిపించుకున్న జ‌య‌ల‌లిత గ‌త ఏడాది అనారోగ్యం కార‌ణంగా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం అని ఆమెపై సినిమా తీయాల‌ని ప‌లువురు ద‌ర్శక నిర్మాత‌లు భావించారు. ఏ.ఎల్‌. విజ‌య్‌, ప్రియ‌ద‌ర్శిని, భార‌తీ రాజా, వైబ్రీ మీడియా,ఆదిత్య భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులు కొన్నాళ్ళుగా బ‌యోపిక్ స్క్రిప్ట్‌ని రూపొందించే ప‌నిలో ఉన్నారు. అయితే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ముందుగా తాను తెర‌కెక్కించనున్న‌ బయోపిక్ టైటిల్ పోస్ట‌ర్‌ని మురుగ‌దాస్ చేతుల మీదుగా విడుద‌ల చేయించింది. ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో రానున్న ఈచిత్రంలో యువ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ జయలలిత పాత్రలో నటించనుంది. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం లాంచ్ వేడుక త్వరలోనే గ్రాండ్ గా జరుగనుంది.

ఇక విష్ణు ఇందూరి నిర్మాణంలో ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించ‌నున్న చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరి 24న లాంచ్ కానుంద‌ని అంటున్నారు. మ‌రో వైపు త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా.. జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్‌ని కానీ... అనుష్కను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు భారతీ రాజా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి దేశవ్యాప్తంగా బ‌జ్ క్రియేట్ అయ్యేందుకు జ‌య‌ల‌లిత పాత్ర‌లో ఐశ్వ‌ర్య‌రాయ్ లేదంటే అనుష్క‌ని తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌.

1414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS