జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి రంగం సిద్ధం..!

Thu,August 16, 2018 10:51 AM
Jayalalitha biopic started soon

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఇటు సినిమాలు, అటు రాజ‌కీయాల‌లో త‌న‌దైన పాత్ర పోషించి ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. త‌మిళ‌నాడు ఐర‌న్ లేడీగా, అమ్మ‌గా, పురుచ్చతలైవీగా త‌మిళ తంబీల‌తో పిలిపించుకున్న జ‌య‌ల‌లిత గ‌త ఏడాది అనారోగ్యం కార‌ణంగా మృతి చెందింది. అమ్మ మ‌ర‌ణంతో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే జ‌య‌ల‌లిత జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం అని ఆమెపై సినిమా తీయాల‌ని ప‌లువురు ద‌ర్శక నిర్మాత‌లు భావించారు. కాని ఏ ఒక్క‌రు ఈ సినిమాపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ నిర్మిస్తున్న వైబ్రీ మీడియా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని నిర్మించ‌నున్న‌ట్టు తాజా స‌మాచారం. త‌మ సంస్థ‌లో 83వ సినిమాగా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని నిర్మించాల‌ని వారు భావిస్తున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విజ‌య్ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. జ‌య‌లలిత పుట్టిన తేది ఫిబ్ర‌వ‌రి 24 కాగా, వ‌చ్చే ఏడాది అదే రోజు మూవీని ప్రారంభించ‌నున్నారు. ఇదిలా ఉంటే ఆదిత్య భ‌ర‌ద్వాజ్ .. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో చేయ‌బోతున్న‌ట్టు గ‌తంలో ప్ర‌కటించాడు. వై స్టార్ సీటీపీఎల్ బేన‌ర్‌పై ఈ చిత్రం రూపొంద‌నుంది. థాయ్ పురుచ్చతలైవీ అనే టైటిల్‌ని జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి ఫిక్స్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ అఫీషియ‌ల్‌గా లాంచ్ కానుంది.

ఆదిత్య భ‌ర‌ద్వాజ్ తెర‌కెక్కించ‌నున్న చిత్రం 70 శాతం చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌ర‌గ‌నుంది . న‌టిగా ఉన్న‌ప్పుడు జయ‌ల‌లిత లైఫ్‌కి సంబంధించిన స‌న్నివేశాల‌ని అక్క‌డ షూట్ చేయనున్నారు. ఇక సినిమాల త‌ర్వాత జ‌య‌లలిత పొలిటిక‌ల్ జ‌ర్నీ ఎలా సాగింది, ఆమె మ‌ర‌ణం వెనుక ఆస‌క్తిక‌ర విష‌యాలకి సంబంధించిన స‌న్నివేశాల‌ను చెన్నైలో షూట్ చేయ‌నున్నారు. ఇక త్వ‌ర‌లో కాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన విష‌యాలు కూడా రివీల్ చేయ‌నున్నారు. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపు పూర్తి కాగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి చివ‌రి వారంలో లేదంటే ఫిబ్ర‌వ‌రి మొదటి వారంలో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ట.

1975
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS