అమ్మ‌గా విద్యా బాల‌న్‌.. అతిధిగా అరవింద స్వామి

Sat,December 15, 2018 08:29 AM
jayalalitha another biopic goes on to the sets very soon

పురుచ్చతలైవీ జ‌య‌ల‌లిత గ‌త ఏడాది అనారోగ్యం కార‌ణంగా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం. అమ్మ‌ అని ప్రేమ‌తో త‌మిళ తంబీలు పిలుచుకుంటారు. ఆమెపై సినిమా తీయాల‌ని ప‌లువురు ద‌ర్శక నిర్మాత‌లు భావించారు. ఏ.ఎల్‌. విజ‌య్‌, ప్రియ‌ద‌ర్శిని, భార‌తీ రాజా, వైబ్రీ మీడియా,ఆదిత్య భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులు కొన్నాళ్ళుగా బ‌యోపిక్ స్క్రిప్ట్‌ని రూపొందించే ప‌నిలో ఉన్నారు. అయితే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ముందుగా తాను తెర‌కెక్కించనున్న‌ బయోపిక్ టైటిల్ పోస్ట‌ర్‌ని ఆ మ‌ధ్య మురుగ‌దాస్ చేతుల మీదుగా విడుద‌ల చేయించింది. జ‌య‌లలిత వ‌ర్దంతి సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ కూడావిడుద‌ల చేసింది. ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో రానున్న ఈచిత్రంలో నిత్యా మీన‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తుంది .

ప‌లువురు త‌మిళ ద‌ర్శ‌కులు కూడా జ‌య‌ల‌లిత‌పై బ‌యోపిక్ చేయాల‌ని ఎప్ప‌టి నుండో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. విష్ణు ఇందూరి నిర్మాణంలో ఏఎల్ విజ‌య్ కూడా జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తెర‌కెక్కిస్తాడ‌ని అంటున్నారు. మ‌రో వైపు త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా.. జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్‌ని కానీ... అనుష్కను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు భారతీ రాజా ప్ర‌య‌త్నిస్తున్నారట‌. అయితే విజ‌య్ తెర‌కెక్కించ‌నున్న సినిమాలో అమ్మ‌గా బాలీవుడ్‌ విలక్షణ నటి విద్యాబాలన్‌ నటించనున్నారట. ఈ పాత్ర‌ కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట.

2275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles