చిరు బ‌ర్త్‌డేకి వ‌రుణ్ గిఫ్ట్ ఏంటో తెలుసా ?

Thu,August 22, 2019 10:24 AM
jarra Jarra Video Promo vieo from valmiki

మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడ‌ల‌లో న‌డుస్తూ మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకి అనే చిత్రం చేస్తున్నాడు. కోలీవుడ్ సూప‌ర్ హిట్ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా , దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా చిరు బ‌ర్త్‌డే కానుక‌గా చిత్రం నుండి జ‌ర్ర జ‌ర్ర వీడియో సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఈ సాంగ్‌ని విడుద‌ల చేయ‌గా ఇందులో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయితో వ‌రుణ్ వేసే స్టెప్పులు ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు అధ‌ర్వ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles