ప్ర‌భాస్ ఇంటి ముందు జ‌పాన్ అమ్మాయిల సంద‌డి..!

Tue,June 11, 2019 08:43 AM
japan fans meets prabahs

బాహుబ‌లి సిరీస్‌లో వ‌చ్చిన రెండు సినిమాల‌ త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ ఖండాంత‌రాలు దాటింది. ముఖ్యంగా జ‌పాన్‌లో ప్ర‌భాస్‌కి మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అమ్మాయిల‌యితే ప్ర‌భాస్ అంటే ప‌డిచచ్చిపోతున్నారు. రీసెంట్‌గా జ‌పాన్‌కి చెందిన కొంత మంది అమ్మాయిలు హైద‌రాబాద్‌లోని ప్ర‌భాస్ ఇంటికి వెళ్లి ఆయ‌న ఇంటిముందు ర‌కర‌కాల భంగిమ‌ల‌లో నిలుచొని ఫోటోకి ఫోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ మ‌ధ్య ప్రభాస్ బ‌ర్త్ డేని జ‌పనీస్‌, ఘ‌నంగా సెల‌బ్రేట్ జరుపుకోవ‌డం , ఆయ‌న పోస్ట‌ర్స్‌ని ఇంట్లో పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రాన్ని కూడా జ‌పాన్‌లో భారీ ఎత్తున విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప‌లు భాషల్లో విడుద‌ల కానున్న సాహో చిత్రంలో ప్ర‌భాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించారు. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

6443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles