జాన్వీకపూర్ కోరిక నెరవేరనుందా..?

Mon,December 16, 2019 02:47 PM

కాఫీ విత్ కరణ్ షోలో బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ తనకు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించాలని ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సారా చెప్పినట్టుగానే ఇంతియాజ్ అలీ డైరెక్షన్‌లో ఇద్దరికీ కలిసి నటించే అవకాశం వచ్చింది. సారాతోపాటు మరో బ్యూటీ జాన్వీకపూర్ కూడా ఇదే షోలో మాట్లాడుతూ అర్జున్‌రెడ్డి సినిమాతో స్టార్‌డమ్ సంపాదించిన విజయ్‌దేవరకొండతో నటించాలని ఉందని తన మనసులో మాట చెప్పింది. జాన్వీ చిట్‌చాట్‌లో చెప్పిన మాట నిజం కానుంది.


విజయ్‌దేవరకొండ, పూరీజగన్నాథ్ కాంబినేషన్‌లో ఫైటర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను తీసుకోవాలని పూరీకి సూచించాడట. దీనికి పూరీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే త్వరలోనే జాన్వీకపూర్ కోరిక నెరవేరనుందన్నమాట. పూరీ-విజయ్ సినిమాలో హీరోయిన్ల కోసం అలియాభట్, అనన్యపాండేను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

1976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles