చాప‌ర్ పైల‌ట్‌గా శ్రీదేవి కూతురు

Wed,September 5, 2018 01:21 PM
Janhvi Kapoor reportedly cast as first woman IAF chopper pilot

దివంగ‌త శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ధడక్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు జాన్వీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక జాన్వీ తర్వాత సినిమా ఎవరితో చేస్తుందా అని అందరు ఆలోచనలు చేస్తుండగా, బడా ఆఫర్ ఈ అమ్మడిని వరించింది. కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ కి ఛాన్స్ దక్కింది. తక్త్ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన సరసన కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుంది.

ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత‌మాధారంగా త‌క్త్ అనే సినిమాని తెర‌కెక్కించాల‌ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ భావిస్తుంద‌ట‌. గుంజన్‌ పాత్రలో జాన్వీ న‌టిస్తుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో జాన్వి, గుంజన్‌ కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంటే త‌క్త్‌లో జాన్వీ మ‌హిళా పైలట్ పాత్ర పోషిస్తుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. గుంజ‌న్ 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను గుంజన్‌ తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరిచే ప్ర‌శంస‌లు పొందింది. వ‌చ్చే ఏడాది సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

తక్త్ అనే టైటిల్ ని బట్టి ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అని అర్ధమవుతుంది. తక్త్ అంటే బెంచ్ లేదా సీట్ అని అర్ధం. సింహాసనం కోసం పోరాడే వారియర్ సినిమాగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుండగా ఇందులో అలియా భట్ తో పాటు విక్కీ కౌశల్, అనీల్ కపూర్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విక్కీ కౌశల్ కి జతగా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారేమోనని టాక్స్ వినిపిస్తున్నాయి.

3286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS