జాన్వీకపూర్‌కు అరుదైన గౌరవం

Sun,December 9, 2018 08:21 PM
Janhvi Kapoor Named as Rising Talent of the Year

నటించింది ఒక్క సినిమానే..కానీ అభిమానులు మాత్రం చాలా మందే ఉన్నారు. ధడక్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్. అలనాటి అందాల తార శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తూ..తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. జాన్వీకపూర్ అరుదైన గౌరవాన్ని అందుకోనుంది. రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు జాన్వీకపూర్ ఎంపికైంది. ముంబైలోని నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ఈ అవార్డును జాన్వీకపూర్‌కు మంగళవారం ప్రదానం చేయనుంది.

ఈ సందర్భంగా జాన్వీకపూర్ మాట్లాడుతూ..ఈ ఏడాది ధడక్ చిత్రంతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చా. నార్వేలో ఉన్నవారితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూశారు. నార్వే ప్రజలు సోషల్‌మీడియా ద్వారా ధడక్ చిత్రానికి ప్రశంసలు, ఆశీస్సులు అందించారు. ఇలాంటి అరుదైన గుర్తింపు రావడం ఆశ్చర్యంగా, గొప్ప అనుభూతిని కలిగించేలా ఉంది. రైజింగ్ ఆఫ్ ది ఇయర్ టాలెంట్ అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సంతోషకర క్షణాలను అభిమానులతో పంచుకుంది జాన్వీకపూర్.

6236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles