భారీ ఖ‌డ్గంతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేసిన జాన్వి

Thu,March 7, 2019 08:54 AM

అతిలోక సుంద‌రి శ్రీదేవి వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. ధ‌డ‌క్ అనే చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు త‌క్త్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మ‌రో వైపు ఐఏఎఫ్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా తెర‌కెక్కుతున్న చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ వార‌ణాశిలో జ‌రుగుతుంది. అయితే మార్చి 7న జాన్వీ బ‌ర్త్‌డే కాగా, ఆమె పుట్టిన రోజు వేడుక జ‌రిపేందుకు తండ్రి బోనీ క‌పూర్‌, సోద‌రి ఖుషీ వార‌ణాశికి వెళ్లారు. కాశీ విశ్వ‌నాథుడి ద‌ర్శ‌నం అనంతరం హోట‌ల్‌లో జాన్వీతో కేక్ క‌ట్ చేయించారు. ఆ తర్వాత జాన్వి తన తండ్రి, సోదరితో కలిసి గంగా నదిలో బోట్‌ రైడింగ్‌కు వెళ్లారు. అయితే జాన్వీ పెద్ద ఖ‌డ్గంతో కేక్ క‌ట్ చేయ‌డం విశేషం. నిన్న‌టితో 22వ ప‌డిలోకి అడుగుపెట్టిన జాన్వీ త‌న త‌ల్లితండ్రులు గ‌ర్వ‌ప‌డేలా సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపింది. త‌న ప్ర‌తి బ‌ర్త్‌డేకి శ్రీదేవి కాలి న‌డ‌క‌న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంటుంద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంది జాన్వీ. ప్ర‌స్తుతం బ‌యోపిక్‌తో బిజీగా తాను వ‌చ్చే వారం తిరుప‌తికి వెళ‌తాన‌ని పేర్కొంది.6423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles