ఓల్డేజ్ హోమ్‌లో బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకున్న శ్రీదేవి త‌న‌య‌

Wed,March 7, 2018 11:19 AM
Janhvi Kapoor cuts birthday cake at old age home

దివంగ‌త న‌టి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ త‌న 21 వ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ముంబైలోని వృద్ధాశ్ర‌మంలో జ‌రుపుకుంది. శ్రీదేవి లేకుండా ఎప్పుడు త‌న బ‌ర్త్‌డే జ‌రుపుకోని జాన్వీ తొలి సారి త‌న త‌ల్లి లేకుండా కేక్ క‌ట్ చేసింది. చిన్నారుల‌తో పాటు వృద్ధ మ‌హిళ‌లు బ‌ర్త్ డే సాంగ్ పాడ‌గా, ఆ త‌ర్వాత జాన్వీ కేక్ క‌ట్ చేసింది. వృద్ధాశ్ర‌మంలో పుట్టిన రోజు జ‌రుపుకున్న జాన్వీ ఆ త‌ర్వాత త‌న క‌జిన్ సోన‌మ్ క‌పూర్ ఏర్పాటు చేసిన వేడుక‌లో పాల్గొంది. క‌పూర్ సిస్ట‌ర్స్ సోన‌మ్‌, రియా, అన్షుల‌, ష‌ణ‌య‌, ఖుషీ త‌దిత‌రులు బ‌ర్త్‌డే పార్టీలో సంద‌డి చేశారు. బోనీ క‌పూర్ త‌న కూతురు ప‌క్క‌నే ఉండి కేక్ క‌ట్ చేయించ‌డం విశేషం. జాన్వీ బ‌ర్త్ డే వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటోల‌ని సంజ‌య్ క‌పూర్‌, సోన‌మ్‌, రియా లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ఇవి వైర‌ల్‌గా మారాయి. గ‌త ఏడాది జాన్వీ బ‌ర్త్ డే కోసం శ్రీదేవి ఫ్యామిలీ మొత్తం విదేశాల‌కి వెళ్ళిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ వారు చేసిన సంద‌డికి సంబంధించిన ఫోటోల‌ని అతిలోక‌సుందరి త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసి ఫ్యాన్స్‌లో ఫుల్ హ్యాపీనెస్ క‌లిగించింది. ఈ సారి కూడా జాన్వీ బ‌ర్త్‌డే షాపింగ్ కోస‌మనే కజిన్‌ పెళ్ళి త‌ర్వాత రెండు రోజులు దుబాయ్‌లో ఉంది శ్రీదేవి. కాని విధి వైప‌రిత్యం శ్రీదేవి అనంత‌లోకాల‌కి వెళ్ళేలా చేసింది. జాన్వి డెబ్యూ మూవీ ‘ధడక్‌’ మరాఠీలో సూపర్‌ హిట్‌ అయిన ‘సైరాట్‌’ సినిమాకు రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు.

2614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles