జాన్వీకపూర్ బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్

Mon,June 17, 2019 02:40 PM
janhvi Kapoor Belly Dancing Moves for DD2 Challenge


ధఢక్‌తో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్. ఈ భామ తాజాగా ‘డ్యాన్స్ దీవానే 2’ ఛాలెంజ్‌ను స్వీకరించింది. కలర్స్ టీవీ ఛానెల్‌లో ప్రసారమయే డ్యాన్స్ దీవానే 2 ఛాలెంజ్ రియాలిటీ షోకు మాధురీ దీక్షిత్, శశాంక్ కైతాన్ (ధడక్ డైరెక్టర్)జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోను ప్రమోట్ చేసేందుకు షో థీమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని యువ నటీనటులకు శశాంక్ కైతాన్ ఛాలెంజ్ విసిరాడు.

జాన్వీకపూర్, ఇషాన్‌కట్టర్, వరుణ్‌ధావన్‌కు శశాంక్ కైతాన్ ఈ ఛాలెంజ్ విసిరాడు. థీమ్ సాంగ్‌కు జాన్వీకపూర్ తనదైన ైస్టెల్‌లో బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. మరోవైపు ఇషాన్ ఖట్టర్ కూడా థీమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను కలర్స్ టీవీ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇపుడు ధఢక్ స్టార్ల డ్యాన్స్ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుణ్ ధవన్ మాత్రం ఇంకా ఛాలెంజ్‌ను స్వీకరించాల్సి ఉంది.2470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles